బికినీలో చిలిపిగా పటౌడీ వారసురాలు

0

తనదైన అందం ప్రతిభతో మైమరిపిస్తోంది పటౌడీ ఖాన్ సైఫ్ వారసురాలు సారా అలీఖాన్. సారా ఇటీవల సోదరుడు ఇబ్రహీం .. తల్లి అమృత సింగ్ తో కలిసి మాల్దీవుల విహారానికి వెళ్లిన సంగతి తెలిసినదే. అక్కడ తనకు నచ్చినట్టు బికినీ బీచ్ సెలబ్రేషన్స్ తో ఫుల్ జోష్ లో ఉంది.

సారా అలీ ఖాన్ నీలం మోనోకిని ఆరెంజ్ సన్ షేడ్స్ లో పోజులిచ్చింది. దీనికి ఆసక్తికర క్యాప్షన్ ఇచ్చింది. “పైన ఆకాశం క్రింద ఇసుక .. ఈ క్షణంలో జీవించండి. ప్రవాహంతో కదలండి“ అంటూ ఎగ్జయిట్ మెంట్ ని చూపించింది. కొత్త సంవత్సరంలో మాల్దీవుల్లో ట్రిప్ ని ఫుల్ గా ఎంజాయ్ చేసిందని తాజా ఫోటోలు చెబుతున్నాయి.

సారా రకరకాల భంగిమల్లో బికినీ బీచ్ ట్రీట్ ని ఫోటోల రూపంలో షేర్ చేయగా అవన్నీ అంతర్జాలంలో సునామీ స్పీడ్ తో దూసుకుపోతున్నాయి. కూలీనంబర్ 1 తర్వాత వరుసగా పలు భారీ చిత్రాల్లో నటించేందుకు సారా సన్నాహకాల్లో ఉంది. అక్షయ్ హీరోగా నటిస్తున్న ఓ సినిమాలో ధనుష్ సరసన నటిస్తోంది.