Templates by BIGtheme NET
Home >> Cinema News >> ‘సోలో బ్రతుకే సో బెటర్’ టాక్

‘సోలో బ్రతుకే సో బెటర్’ టాక్


చిత్రలహరి , ప్రతి రోజు పండగే చిత్రాలతో మెగా హిట్స్ అందుకున్న సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం ‘సోలో బ్రతుకే సో బెటర్’ చిత్రం చేస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర LLP బ్యానర్‌పై BVSN ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సుబ్బు డైరెక్ట్ చేస్తున్నాడు. సుబ్బు చిత్రానికి ఇది మొదటిది కావడం విశేషం. నభా నటేష్ హీరోయిన్ గా నటిస్తుండగా క్రిస్మస్ కానుకగా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దాదాపు 8 నెలల తర్వాత థియేటర్స్ లలో ఫస్ట్ బొమ్మ సోలో తో పడడంతో అందరి చూపు దీనిపైనే ఉంది.

ప్రస్తుతం చాల చోట్ల మొదటి షో పడగా..సినిమా చూసిన అభిమానులు , ప్రేక్షకులు తమ స్పందనను సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి సినిమా కు అన్ని చోట్ల పాజిటివ్ రిపోర్ట్స్ వస్తున్నాయి. సినిమా డీసెంట్ హిట్ అని , ఫస్టాఫ్ యావరేజ్‌గా ఉన్నప్పటికీ సెకండాఫ్ మాత్రం అదిరిపోయిందని చెపుతున్నారు. ఫస్టాఫ్‌లో సాయితేజ్, సత్య మధ్య వచ్చే కామెడీ సీన్స్ బాగున్నాయని, వెన్నెల కిషోర్ సీన్స్ యావరేజ్‌గా ఉన్నట్లు చెపుతున్నారు. ఎమోషనల్ సీన్స్‌లో రావు రమేష్ ఎప్పటిలానే అద్భుతంగా నటించారట. ఇంటర్వెల్ బ్యాంగ్‌లో నభా నటేష్ ఎంట్రీ కూడా అదిరిపోయిందని అంటున్నారు.

ఇక సెకండాఫ్ మాత్రం బాగా ఎంటర్‌టైన్ చేస్తుందని ..నభా నటేష్ ఎంట్రీతో సినిమా ఫ్లో మరో స్థాయికి వెళ్లిందని చెబుతున్నారు. సోలో బ్రతుకును కాస్త మింగిల్ చేసి తేజు ఓ ఇంటివాడు అయిపోవడంతో సినిమా ముగుస్తుంది. మొత్తం మీద 9 నెలల విరామం తరవాత తెలుగు ప్రేక్షకులకు ఒక మంచి సినిమాను సాయి ధరమ్ తేజ్ అందించారని చెపుతున్నారు.