Templates by BIGtheme NET
Home >> Cinema News >> బట్టలు మొత్తం విప్పేసి.. ‘బిగ్ బాస్’ బ్యూటీ న్యూఇయర్ విషెస్!!

బట్టలు మొత్తం విప్పేసి.. ‘బిగ్ బాస్’ బ్యూటీ న్యూఇయర్ విషెస్!!


కొంతమంది ఉంటారు.. వాళ్లకు కావాల్సింది జనాల్లో పాపులారిటీ. ఇలాంటి వారిలో ముందు వరసలో ఉంటారు సినిమా ఫీల్డ్ భామలు. దానికోసం ఏమైనా చేస్తారు. ఎలాగైనా చేస్తారు. ఇలాంటి వారి జాబితా తీస్తే చాంతాడంత ఉంటుంది. ఆ లిస్టులో ఏ1 ప్లేస్ నాదే అంటోది బాలీవుడ్ ‘భామ సోఫియా హయాత్’. గతంలో ‘బిగ్ బాస్’ షోలో పాల్గొన్న ఈ బ్యూటీ.. ఆ తర్వాత సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది. లేటెస్ట్ గా న్యూడ్ వీడియో వదిలి అందరి మైండ్లూ బ్లాక్ చేసింది. నటన మీద ఆసక్తితో మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టింది సోఫియా హయాత్. చాలా షోలలో ర్యాంప్ వాక్ చేసిన ఈ అమ్మడు.. ఆ తర్వాత బుల్లితెరపై ప్రసారం అయిన సింగింగ్ కాంపిటీషన్లో పాల్గొంది. అందులో సూపర్ సక్సెస్ అయ్యి నేమ్ అండ్ ఫేమ్ పొందింది. ఆ తర్వాత కొన్ని రియాలిటీ షోలలోనూ మెప్పించింది.

సింగర్గా మోడల్గా హోస్టుగా ఎంతగానో సక్సెస్ అయింది బోల్డ్ బ్యూటీ సోఫియా. ఈ నేపథ్యంలోనే 2007లో ‘ఎగ్జిట్ యాజ్ బ్యూటీ’ అనే చిత్రంతో సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత సుదీర్ఘమైన కెరీర్ కొనసాగించింది ఈ అమ్మడు. ‘క్యాష్ అండ్ కర్రీ యాజ్ ధర్మీ’ ‘ద అన్ఫర్గెటబుల్’ ‘డైరీ ఆఫ్ ఏ బటర్ఫ్లై’ ‘అక్షర్ 2′ సహా కొన్ని సినిమాల్లో నటించింది. దీంతో.. దేశ వ్యాప్తంగా క్రేజ్ను అందుకుంది.

సినిమాల్లో ఫుల్ బిజీగా ఉన్న సమయంలోనే హిందీలో ప్రసారం అవుతోన్న బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ ఏడో సీజన్లో ఎంట్రీ ఇచ్చింది సోఫియా. అందులో అద్భుతమైన ఆటతీరుతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. ఇలా దాదాపు 12 వారాలు హౌస్లో కొనసాగిన ఈమె.. చివర్లో ఎలిమినేట్ అయిపోయింది.

కొన్నేళ్లుగా సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తోంది సోఫియా హయాత్. నిరంతరం యాక్టివ్గా ఉండే ఆమె.. భక్తికి సంబంధించిన అంశాలను ఫాలోవర్లతో పంచుకుంటోంది. అదే సమయంలో హాట్ హాట్ ఫొటోలు వీడియోలు వదులుతూ కుర్రకారు గుండెలకు గాయాలు చేస్తోంది. ఇలా అందాల ఆరబోతలో తనకు తానే సాటి అని అనిపించుకునేలా సాగిపోతోందీ అందాల సుందరి.

తాజాగా మరింత రెచ్చిపోయిన సోఫియా.. ఏకంగా తన నగ్న చిత్రంతో ఓ వీడియో చేసి.. న్యూ ఇయర్ విసెష్ తెలిపింది. తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఈ వీడియోను షేర్ చేసింది. ఈ వీడియో చూసిన యువతరం కళ్లు పెద్దవి చూస్తుంటే.. మరికొందరు నోరెళ్ల బెడుతున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Sofia Hayat (@sofiahayat)