సూపర్ స్టార్ హాలీవుడ్ లుక్

0

సూపర్ స్టార్ మహేష్ బాబు ఫొటోలను నమ్రత రెగ్యులర్ గా షేర్ చేస్తూ వస్తోంది. ఇటీవల దుబాయి హాలీడే ట్రిప్ వెళ్లిన మహేష్ బాబు ఫ్యామిలీ అక్కడ చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు. మరో ఫొటోను నమ్రత షేర్ చేసింది. ఈ ఫొటోకు అభిమానులు హాలీవుడ్ హీరో లా ఉన్నాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. రెగ్యులర్ గా కనిపించే కంటే మహేష్ బాబు ఈమద్య భిన్నంగా కనిపిస్తున్నాడు. ముఖ్యంగా ఆయన హెయిర్ స్టైల్ మారింది. ఇక ఈ ఫొటోలో అత్యంత స్టైలిష్ గా గాగుల్స్ ధరించి రాయల్ లుక్ లో కనిపించిన సూపర్ స్టార్ అభిమానులను ఫిదా చేస్తున్నాడు.

తెల్లవారు జామున 3 గంటల సమయంలో ఎవరు ఇలా కనిపిస్తారు అంటూ నమ్రత ఈ ఫొటోను షేర్ చేసి కామెంట్ పెట్టింది. ఎయిర్ పోర్ట్ లో తెల్లవారు జామున నమ్రత తీసిన ఈ ఫొటో రెండు మూడు గంటల్లోనే వైరల్ అయ్యింది. సోషల్ మీడియాలో వేలకు పైగా షేర్స్ లక్షల్లో లైక్స్ వచ్చాయి. నమ్రత ఈ ఫొటోను రెండు గంటల క్రితం షేర్ చేసింది. ఇంతలోనే 85 వేలకు పైగా లైక్స్ వచ్చాయి. నెటిజన్స్ అంతా నిద్రలోంచి లేస్తే అంటే మరో రెండు గంటల్లో ఈ ఫొటోకు రెండు లక్షలకు పైగా లైక్స్ రావచ్చు అంటున్నారు. సర్కారు వారి పాట సినిమా కోసం మహేష్ బాబు లుక్ మార్చుతున్నాడు. అందుకే కాస్త జుట్టు పెంచుతున్నాడు.