తెలుగమ్మాయిల్ని ఈజీగా `కమిట్ మెంట్` అడిగేస్తారా?

0

కమిట్ మెంట్ .. ఈ టైటిల్లోనే బోలెడంత మీనింగ్ ఉంది. చిత్రపరిశ్రమలో అందాల కథానాయికల్ని కమిట్ మెంట్ అడిగేవాళ్లకు కొదవేమీ ఉండదు. ఈ తరహా సమస్యల్ని తెలుగమ్మాయిలు ఎదుర్కొంటారని క్లూ ఇచ్చింది తేజస్వి మాదివాడ. ఈ తెలుగమ్మాయి కి అలాంటివి ఎదురైతే అసౌకర్యం ఫీలైందట. అంతేకాదు అలాంటి వేధింపుల్ని ఎదుర్కొని పోరాటమే సాగించిందట.

కమిట్ మెంట్ టీజర్ ఈవెంట్లో ఇలాంటి ఎన్నో సంగతుల్ని తెలుగమ్మాయి తేజస్వి వెల్లడిస్తుంటే అందరికీ షాక్ లు తప్పలేదు. ఇక ఈ మూవీలో ఘాటైన ముద్దు సన్నివేశాలు.. బెడ్ రూమ్ సన్నివేశాలకు కొదవేమీ ఉండదని అయితే తనకు ఇంకా అంత వయసు రాకపోవడం వల్ల వాటిని చేయలేదని కూడా తెలిపింది.

తేజస్వి మాట్లాడుతూ.. ఈ తరహా ఘాడమైన భావోద్వేగాలను చిత్రీకరించడానికి ఆమె ఇంకా చిన్నవయస్సులో ఉన్నందున ఇప్పటి వరకు ఆ సీన్స్ తీయలేదట. ‘కమిట్మెంట్’ లో ముద్దు సన్నివేశాలు చేయాల్సి ఉందిట. “నాకు తెలిసిన వ్యక్తిని ముద్దు పెట్టుకోవాలనుకున్నాను.. ఎవరో తెలీని యాదృచ్ఛిక వ్యక్తి కాదు. శ్రీనాథ్ అందమైనవాడు. నేను అతనికి తెలుసు అని నేను భావించాను“ అంటూ తెలిపింది. ఇందులో కేవలం ఘాటైన ముద్దు సన్నివేశాలు మాత్రమే కాకుండా బోయ్స్ తో సన్నిహిత సన్నివేశాలు కూడా ఉంటాయి. ఈ చిత్రం ప్రతి అమ్మాయి కథ అని తేజస్వి చెప్పింది.

వృత్తి నిబద్ధతకు కట్టుబడి పరిశ్రమలో పని చేశాను. కానీ తెలుగు ప్రజలు అలాంటి వారిని తక్కువగా చూస్తారని తేజస్వి ఆవేదన చెందారు. ఇక్కడ కమిట్ మెంట్ అనేది చాలా తేలికగా అడిగేస్తారు. చాలాసార్లు అసౌకర్యంగా భావించి అలాంటివాటిపై పోరాడిందట. ఇది తన కథలానే ఉంటుందని కూడా వెల్లడించింది తేజస్వి. ప్రతి అమ్మాయి కథ ఇది అని తెలిపింది. కమిట్ మెంట్ టీజర్ ఆకట్టుకుంది. ట్రైలర్ సినిమా ఎలా ఉండనున్నాయో అన్న క్యూరియాసిటీ బోయ్స్ లో పెంచగలిగారు.