ఒంటరి దీవుల్లో ఆకాశమే హద్దుగా కాజల్ కిచ్లు హనీమూన్

0

స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ అక్టోబర్ 30 న ముంబై బిజినెస్ మేన్ కం ఫ్రెండు గౌతమ్ కిచ్లు ని పెళ్లాడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ జంట మాల్దీవులలో హనీమూన్ సెలబ్రేషన్ లో ఫుల్ గా చిలౌట్ చేస్తున్నారు. ఒంటరి దీవుల్లో ఆకాశమే హద్దుగా చెలరేగుతున్న ఫోటోలు వీడియోలు ఇప్పటికే అంతర్జాలాన్ని షేక్ చేస్తున్నాయి.

తాజా సంచలనం ఏమిటంటే.. కాజల్ తన హనీమూన్ విహారయాత్రకు కళ్లు భైర్లు కమ్మేంత డబ్బును విచ్చలవిడిగా ఖర్చు చేస్తోందని బాలీవుడ్ మీడియాలు కథనాన్ని ప్రచురించాయి. కొన్ని మీడియా వర్గాల సమాచారం ప్రకారం… కొత్త జంట నీటి అడుగున ఉన్న హోటల్ లో ఉంటున్నారు. దీని కోసం కాజల్ కిచ్లు జంటకు ఓవరాల్ గా 38 లక్షలు ఖర్చవుతోందిట. ఇదే నిజమైతే.. అందాల కథానాయికల హనీమూన్ సెలబ్రేషన్స్ లోనే.. కాజల్ హనీమూన్ వెరీ స్పెషల్ అని చెప్పాలి. ఖచ్చితంగా ఇటీవలి కాలంలో అత్యంత ఖరీదైన సెలబ్రేషన్ ఇదేనని గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇక హనీమూన్ ముగించిన వెంటనే కాజల్ వరుసగా కమిట్ మెంట్లను పూర్తి చేయాల్సి ఉంటుంది. భారతీయుడు 2 అలాగే ఆచార్య చిత్రీకరణలతో బిజీ కానుంది. అలాగే కాజల్ నటించిన రీమేక్ మూవీ పారిస్ పారిస్ ని రిలీజ్ చేయాల్సి ఉంది.