రిలీజ్ డేట్ నే దొంగిలించే చోర కళ!

0

కథా వైవిధ్యంతో పాటు టైటిల్ వైవిధ్యంతోనూ ఆకట్టుకునే హీరోల్లో శ్రీవిష్ణు ఒకరు. తన అభిరుచికి తగ్గట్టే పోస్టర్ లోనూ క్రియేటివిటీ సెట్టవుతోంది. ఇంతకుముందు బ్రోచేవారెవరురా? తరహాలో తాజా గా `రాజ రాజ చోర` అనే టైటిల్ ఆకట్టుకుంది. ఇందులో పౌరాణిక గెటప్పు తోనే శ్రీవిష్ణు ఆకట్టుకున్నాడు. అతడి నుంచి మరో కామెడీ ఎంటర్ టైనర్ వస్తోందని అర్థమవుతోంది.

ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ- అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. హసిత్ గోలి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో సునయన నాయికగా నటిస్తోంది. హీరో శ్రీవిష్ణు పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేయగా వైరల్ అయ్యింది.చోర విద్యలో ఆరితేరిపోయిన రాజ రాజ చోరు..చోర కళతో రక్తి కట్టిస్తాడనడంలో సందేహమేం లేదు.

తాజాగా రిలీజ్ తేదీని కూడా దోచేసే చోరకళ ను ప్రదర్శిస్తున్నాడట. తొందర్లోనే డేట్ ని వెల్లడిస్తారని తెలిసింది. ఈ సందర్భంగా కామిక్ స్టైల్లో శ్రీవిష్ణు `హ్యాపీ బర్త్ డే` పోస్టర్ ఆకట్టుకుంది. అన్నట్టు రిలీజ్ డేట్ ని దొంగిలించడం ఈజీనే కానీ.. తెలుగు రాష్ట్రాల్లో టాప్ ఎగ్జిబిటర్స్ నుంచి నచ్చిన ప్రైమ్ ఏరియా థియేటర్లను దొంగిలించడమే చాలా కష్టం. ఆ కళలో కూడా శ్రీవిష్ణు ఆరితేరతాడనే ఆశిద్దాం.