Templates by BIGtheme NET
Home >> Cinema News >> ఆ విషయాలు నేను చెప్తేనే తెలుస్తుంది: రష్మిక

ఆ విషయాలు నేను చెప్తేనే తెలుస్తుంది: రష్మిక


ప్రస్తుతం ఫిల్మ్ ఇండస్ట్రీలో యంగ్ హీరోయిన్ల హవా మాములుగా లేదు. ముఖ్యంగా కన్నడ భామ రష్మిక మందన. ఛలో సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రష్మిక.. ఫస్ట్ సినిమాతోనే తన క్యూట్ హావభావాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఆ తర్వాత గీతగోవిందంతో ఫ్యామిలీ ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. అప్పటి నుండి మొన్నటి భీష్మా వరకు అలాగే తన హిట్స్ తో ఆకట్టుకుంటోంది కుర్రది. తెలుగులో అన్నీ బబ్లీ క్యారెక్టర్స్ చేసిన రష్మిక త్వరలోనే పుష్ప సినిమాతో ఓ ఛాలెంజింగ్ క్యారెక్టర్లో అలరించనుంది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో రానున్న ‘పుష్ప’ సినిమాలో రష్మిక చిత్తూరు అమ్మాయిగా.. అంటే పక్కా పల్లెటూరు అమ్మాయిగా నటించనుంది. అందుకోసం అక్కడి బాషా యాస అన్ని నేర్చుకుందట. ప్రస్తుతం పుష్ప షూటింగ్ దశలో ఉండగానే పలు క్రేజీ ప్రాజెక్టులను అమ్మడు లైన్ లో పెడుతోంది. ప్రస్తుతం అమ్మడి చేతినిండా సినిమాలు ఉన్నాయి. ఎలా అంటే ఇదేగాక ఇంకో ఏడాది కూడా బిజీ అయ్యేలా రెడీ చేసి పెట్టుకుంది.

టాలీవుడ్ శాండల్ వుడ్ కోలీవుడ్ ఇండస్ట్రీలు మాత్రమే కాకుండా త్వరలో రష్మిక.. బాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టనుంది. బాలీవుడ్ యువహీరో సిద్దార్థ్ మల్హోత్రా డెబ్యూ డైరెక్టర్ శాంతను బాగ్చి కాంబోలో రానున్న ‘మిషన్ మజ్ను’ సినిమాతో రష్మిక బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుంది. తాజాగా ఈ మూవీ పోస్టర్ కూడా విడుదల చేసింది చిత్ర బృందం. అదేగాక అమితాబ్ బచ్చన్ సినిమాలో కూడా నటించనుంది. ఇప్పటికే ఒప్పందాలు కూడా అయిపోయాయి. అమ్మడు షూటింగ్ లో జాయిన్ అవ్వడమే మిగిలిందట. ఇక కోలీవుడ్ లో కార్తీ సరసన సుల్తాన్ సినిమా చేస్తోంది. ఆ సినిమాతో రష్మిక తమిళంలో అరంగేట్రం చేయనుంది. తమ అభిమాన హీరోయిన్ బాలీవుడ్ ఎంట్రీ అనేసరికి రష్మిక అభిమానులలో కూడా కొత్త ఉత్సాహం మొదలైంది. తాజాగా రష్మిక ట్విట్టర్ వేదికగా లైవ్ లో ప్రత్యక్షమైంది. అందులో తన ఫ్యూచర్ సినిమాల గురించి ఒక్కమాట కూడా చెప్పేలేదు బ్యూటీ. అంతేగాక ఇప్పట్లో చెప్పలేనని.. నేను చెప్పినప్పుడే ఆ సినిమాల విషయాలు బయటికి వస్తాయంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం కెరీర్ పరంగా రష్మిక పీక్స్ లో ఉందని చెప్పవచ్చు. చూడాలి ఏం చేయనుందో.!!