Templates by BIGtheme NET
Home >> GADGETS >> ఐఫోన్ లాంచింగ్ ఆలస్యం ఖరీదు రూ.7.42లక్షల కోట్లు?

ఐఫోన్ లాంచింగ్ ఆలస్యం ఖరీదు రూ.7.42లక్షల కోట్లు?


ఆలస్యానికి మూల్యం కొన్నిసార్లు ఊహకు అందని రీతిలో ఉంటుంది. తాజాగా అలాంటి ఉదంతం బయటకు వచ్చింది. ప్రఖ్యాత టెక్ కంపెనీ యాపిల్.. తన తాజా ఐఫోన్ 12ను మార్కెట్లోకి తీసుకురావటంలో ఆలస్యమైన విషయం తెలిసిందే. దీని కారణంగా ఆ కంపెనీ ఫ్యూచర్ స్టాక్ విలువ ఐదు శాతం పతనమైంది. చూసేందుకు ఐదు శాతమే అయినా.. దాని విలువ భారీగా ఉన్నట్లు లెక్క కట్టారు. అనుకున్న సమయానికి మార్కెట్లోకి ఐఫోన్ 12ను తీసుకురావటంలో జరిగిన ఆలస్యానికి వంద బిలియన్ డాలర్ల మొత్తం పతనమైందని చెబుతున్నారు.

మన రూపాయిల్లో చూస్తే.. అది కాస్తా రూ.7.42లక్షల కోట్లుగా చెబుతున్నారు. గడిచిన ఏడేళ్లుగా ప్రతి ఏడాదిగా సెప్టెంబరులో యాపిల్ సంస్థ తన కొత్త ఫోన్ ను లాంచ్ చేస్తూ ఉంటుంది. ఈసారి 5జీ ఫోన్ మార్కెట్లోకి వస్తుందన్న మాటతో భారీ అంచనాలు సాగాయి. ఆ ఫోన్ కోసం ఎదురుచూస్తున్న వారు మరే ఫోన్ కొనకుండా ఉండిపోయారు. దీంతో అమ్మకాల మీద ప్రభావం పడింది. అయితే.. కరోనా కారణంగా మాక్ లు.. ఎయిర్ పాడ్ ల విక్రయాలు పెరగటంతో కంపెనీ లాభాల్లో పెరుగుదలకు కారణమైంది. అదే జరగకుండా మరింత ఇబ్బందికరంగా ఉండేది.

మొత్తంగా విక్రయాల్లో 20.7 శాతం తగ్గినప్పటికి.. మిగిలిన వాటి అమ్మకాలు కవర్ చేశాయి. దీంతో మొదట్లో అంచనా వేసిన దానితో పోలిస్తే.. త్రైమాసిక లాభాలపై ప్రభావాన్ని చూపింది. ఈ కారణంగా ఒక్కో షేరుకు 0.73 డాలర్ల ఆదాయం వచ్చేలా చేసింది. అనుకున్న సమయానికి ఐఫోన్ మార్కెట్లోకి వచ్చి ఉంటే.. పరిస్థితి మరోలా ఉండేదంటున్నారు. దీంతో పాటు.. చైనా మార్కెట్లో ఈసారి అమ్మకాలు 29 శాతం తగ్గటం కంపెనీ లాభాల పెరుగుదలపై ప్రభావాన్ని చూపిందని చెప్పాలి. మార్కెట్లోకి యాపిల్ 12 సిరీస్ వచ్చిన తర్వాత పరిస్థితి మెరుగైనట్లుగా కంపెనీ చెబుతోంది.