Templates by BIGtheme NET
Home >> Cinema News >> Anchor Shyamala: యాంకర్ శ్యామలపై వర్మ సీరియస్..

Anchor Shyamala: యాంకర్ శ్యామలపై వర్మ సీరియస్..


యాంకర్ శ్యామల.. అందరికీ తెలిసిన పేరు. సినిమాలు, షోలుచేస్తూ శ్యామల బజీగా మారింది. తాజాగా శ్యామల రామ్ గోపాల్ వర్మ అమ్మాయి సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్‌కు యాంకరింగ్ చేసింది. అయితే ఈ సందర్భంగా శ్యామల అడిగిన ప్రశ్నలకు వర్మ సీరియస్ అయినట్లు సమాచారం. అంతేకాదు.. ఆయన అసహనం వ్యక్తం చేస్తూ స్టేజ్ కూడా దిగేసినట్లు తెలుస్తోంది.

బిగ్ బాస్ 2 ద్వారా సెలబ్రిటీగా మారిన యాంకర్ శ్యామలకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. చిన్న తెరపై తనదైన శైలితో యాంకరింగ్ చేస్తూనే, అందాలతో అందరినీ కట్టిపడేయడం శ్యామల సొంతం. శ్యామల పలు సినిమాల్లో కూడా నటించిన విషయం తెలిసిందే.

ఈ మధ్య శ్యామల పలు సినిమా ఈవెంట్లకు యాంకరింగ్ కూడా చేస్తోంది. తాజాగా రామ్ గోపాల్ వర్మ తీసిన చిత్రం ‘అమ్మాయి’. ఈ సినిమాను వర్మ మార్షల్ ఆర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో, పూజా బాలేకర్ ప్రధాన పాత్రలో తెరకెక్కించారు. సినిమాని రాంగోపాల్ వర్మ జూలై 15వ తేదీ ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలోనే కాకుండా చైనాలో కూడా విడుదల చేయబోతున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో ఈ సినిమా ఫ్రీ రిలీజ్ వేడుకను ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శ్యామల యాంకర్ గా వ్యవహరించింది.

ఈ సందర్భంగా స్టేజ్ ఎక్కిన వర్మ మాట్లాడుతూ అందరికీ థాంక్స్ చెప్పి వేదిక దిగిపోతుండగా యాంకర్ శ్యామల…వర్మ గారిని కొన్ని ప్రశ్నలు వేసింది. యాంకర్ శ్యామల వర్మ గారి దగ్గరికి వచ్చి చిన్న రిక్వెస్ట్ అంటూ అతనికి మైక్ ఇచ్చి మార్షల్ ఆర్ట్స్ కి సంబంధించి వచ్చిన కొన్ని సినిమా పేర్లను చెప్పమని కోరారు.

దీంతో అప్పటికే వర్మ చాలా అసహనంగా ఉన్నారు. ఇవేం పట్టించుకోకుండా ఆయనను యాంకర్ శ్యామల వరుసగా ప్రశ్నలు వేసింది. ఈ విధంగా శ్యామల మాటికి ప్రశ్నలు వేయడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన వర్మ ప్రస్తుతం నేను చాలా ఎమోషనల్ గా ఉన్నాను.. ఇది చాలా సీరియస్ సినిమా అంటూ మైక్ తన చేతికి ఇచ్చి వెళ్లిపోయారు.

వర్మ అలా అనేసి వెళ్లిపోవడంతో శ్యామల షాక్ అయ్యింది. ఆ తర్వాత వర్మకు స్టేజ్ పైనే సారీ చెప్పింది. ఆమె మాట్లాడుతూ ఆర్జీవి సమాధానాలు అంటే అందరికీ ఆసక్తికరంగా ఉంటాయని ఉద్దేశంతోనే తాను అడిగానని అందుకు వర్మ గారు తనని క్షమించాలి అంటూ శ్యామల తనని క్షమాపణలు కోరింది.

దీంతో ఇప్పుడు వీరిద్దరికీ సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అయితే ఒకప్పుడు యాంకర్ శ్యామలను పొగిడిన వర్మ.. ఇప్పుడు ఎందుకిలా సీరియస్ అయ్యాడంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

గతంలో వర్మ యాంకర్ శ్యామలపై షాకింగ్ కామెంట్స్ చేశాడు. శ్యామల అందానికి ముక్తుడయ్యానని,ఇన్ని రోజులు నా కళ్ళల్లో ఎందుకు పడలేదు అంటూ రామ్ గోపాల్ వర్మ శ్యామలపై ప్రశంసలు కురిపించిన విషయం మనకు తెలిసిందే