Templates by BIGtheme NET
Home >> Telugu News >> సుప్రీం కోర్టులో జగన్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ !

సుప్రీం కోర్టులో జగన్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ !


Backlash against Jagan government in Supreme Court

Backlash against Jagan government in Supreme Court

మూడు రాజధానుల బిల్లులపై హైకోర్టు ఇచ్చిన స్టేటస్ కో ఇవ్వడంతో సుప్రీంకోర్టు స్పెషల్ లీవ్ పిటిషన్ ద్వారా సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం సవాలు చేసింది. దీనిపై సుప్రీంకోర్టు ఇవాళ కీలక విచారణ జరిపింది. అయితే అమరావతిలో ఇళ్ల స్థలాల పంపిణీ ఆర్ 5 జోన్ విషయంలో ఏపీ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈ విషయంలో హైకోర్టు ఉత్తర్వులను సుప్రీంకోర్టు సమర్థించింది. ఏపీ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను అత్యున్నత న్యాయస్థానం సమర్థించింది. అమరావతిలో ఇళ్ల స్థలాల పంపిణీ ఆర్ 5 జోన్ విషయంలో హైకోర్టు ఉత్తర్వులను సుప్రీంకోర్టు సమర్ధించింది. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయి అని..దీనిపై కోర్టులోనే తేల్చుకోవాలని ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు తెలిపింది.హైకోర్టులో కేసు తుది విచారణ ముగించాలని సుప్రీంకోర్టు తెలిపింది. దీనితో అమరావతి రైతులు ఆనందంలో మునిగిపోయారు.

రాజధాని బృహత్ ప్రణాళిక లో మార్పులు చేస్తూ గృహ నిర్మాణ జోన్ .. ఆర్-5 జోన్ పై ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను నాలుగు వారాల పాటు హైకోర్టు సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. రాజధాని ప్రాంతంలో ఇళ్ల స్థలాల పంపిణీకి సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే రాజధాని మాస్టర్ ప్లాన్ లో మార్పు చేయాలంటే ప్రజాభిప్రాయ సేకరణ తప్పనిసరి అని తెలిపారు. రాజధాని మాస్టర్ ఫ్లాన్ లో మార్పులకు ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రక్రియను సీఆర్డీఏలోని సెక్షన్ 41 ప్రకారం మాస్టర్ ప్లాన్ ని మార్పు చేయాలంటే.. స్థానిక సంస్థలు గ్రామ కమిటీల నుంచి అభిప్రాయాలు సేకరించాలని రాజధాని రైతుల తరపున న్యాయవాది వాదనలు బలంగా వినిపించారు. అనంతరం ప్రభుత్వం వాదనలు సైతం వినింది. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం ప్రభుత్వ ఉత్తర్వులను సస్పెండ్ చేసింది.

అమరావతిలో ఆర్ 5 జోన్ ను ప్రకటిస్తూ ప్రభుత్వం గతంలో గెజిట్ నోటిఫికేషన్ 355ను విడుదల చేసింది. ఆర్ 5 జోన్ కింద రాజధానిలోని 29 గ్రామాల ప్రజలకే కాకుండా గుంటూరు విజయవాడతో పాటు మంగళగిరి పెదకాకాని తాడేపల్లి దుగ్గిరాల మండలాల వారికి కూడా ఇళ్ల స్థలాలను ఇచ్చేందుకు 1300 ఎకరాలను కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఈ ఉత్తర్వులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అమరావతి ప్రాంత రైతులు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులని సస్పెండ్ చేయడంతో .. దీన్ని సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుని ఆశ్రయించింది. అయితే అక్కడ కూడా ప్రభుత్వానికి చుక్కెదురైంది. సుప్రీం కూడా హైకోర్టుని సమర్థిస్తూ .. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయి అని ఈ విషయాన్ని హైకోర్టు లో కోర్టులోనే తేల్చుకోవాలని ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు తెలిపింది.