Templates by BIGtheme NET
Home >> Telugu News >> హిమాలయాల్లో మరో సంజీవనీ.. రూ.70లక్షలు

హిమాలయాల్లో మరో సంజీవనీ.. రూ.70లక్షలు


Himalayan Herbal cost 70 Lakhs

Himalayan Herbal cost 70 Lakhs

హిమాలయన్ వయాగ్రా.. దీన్నే ‘కార్డిసెప్స్ సైనెన్సిస్’ మూలికగా చెబుతుంటారు. చూడడానికి ఎండు మిరపకాయల్లా ఉంటాయి.. కానీ దగ్గరి నుంచి చూస్తే ఇవీ గొంగళి పురుగులు.. వీటికి ఫంగస్ సోకి ఎండిపోతాయి.. వీటికి అద్వితీయమైన శక్తి ఉంది. ఈ హిమాలయాల్లో దొరికే అరుదైన గొంగళి పురుగులకు మొండి రోగాలు నయం చేసే శక్తి ఉంది. వీటిని కొనాలంటే మన ఆస్తులు అమ్ముకోవాలి.. అంత ఖరీదు మరీ..

ఈ గొంగళి పురుగులు కేవలం హిమాలయాల్లో మాత్రమే లభ్యమవుతాయి. అందుకే వీటిని హిమాలయన్ వయాగ్రా అంటారు. సముద్రమట్టానికి 3వేల నుంచి 5వేల మీటర్ల ఎత్తులో మాత్రమే జీవించే ‘కీడా జాడీ’ అనే గొంగళి పురుగులు నేలపై పాకే సమయంలో ఫంగస్ కు గురై భూమిలోకి కూరుకుపోతాయి. అవి క్రమేణా ఎండిపోతాయి. వీటిని టిబెట్ లో ‘యర్సగుంబ’ అని పిలుస్తారు. వీటిని సేకరించడమంటే ప్రాణాలకు తెగించి హిమాలయాల్లో పర్వతాలపైకి ఎక్కి అన్వేషించాలి.

హిమాలయాలున్న నేపాల్ భూటాన్ టిబెట్ భారత్ లలోనే ఇవి లభిస్తాయి. మే జూన్ లో ఎండాకాలంలో హిమాలయాల్లోని మంచు కరిగినప్పుడు మాత్రమే వీటిని అక్కడి ప్రజలు సేకరిస్తారు. విదేశాల్లోకి వీటికి ఫుల్ డిమాండ్. ఏకంగా కిలోకు రూ.70లక్షల వరకు పలుకుతుంది. ఒక గ్రామకు రూ.7వేలు తీసుకుంటారు. వీటిని సేకరించడం సాహసంతో కూడిన వ్యవహారం.

ఈ గొంగళి పురుగుల్లో దివ్యౌషధం ఉంటుంది. ఈ మందు నంపుసకత్వం అంగస్తంభన సమస్యలను దూరం చేస్తుంది. క్యాన్సర్ ఆస్తమా డయాబెటిస్ దగ్గు జలుబు కామెర్లను తగ్గిస్తుంది. ఔషధాల తయారీలో ఎక్కువగా వాడుతారు. మొండి రోగాలు నయం చేసే దీని కోసం విదేశాల్లో ఎగబడుతారు.