Templates by BIGtheme NET
Home >> Telugu News >> World Biggest World Trade Centre : ప్రపంచంలోనే అతిపెద్ద వరల్డ్ ట్రేడ్ సెంటర్.. హైదరాబాద్ లో..!

World Biggest World Trade Centre : ప్రపంచంలోనే అతిపెద్ద వరల్డ్ ట్రేడ్ సెంటర్.. హైదరాబాద్ లో..!


world biggest world trade centre: హైదరాబాద్ సిగలో మరో అణిముత్యం చేరబోతోంది. ఇప్పటికే ప్రపంచ దిగ్గజ కంపెనీలన్నీ హైదరాబాద్ లో కొలువుదీరాయి. ఇప్పుడు భారతదేశంలోనే అతిపెద్ద ప్రపంచ వాణిజ్య కేంద్రం హైదరాబాద్ లో నిర్మించబడుతోంది. నగరానికి చెందిన ఓ ప్రముఖ సంస్థ శంషాబాద్ సమీపంలో సుమారు 50 నుంచి 60 ఎకరాల విస్తీర్ణంలో ఈ వరల్డ్ ట్రేడ్ సెంటర్ ను నిర్మిస్తోంది. దీంతో హైదరాబాద్ భారత వాణిజ్య కేంద్రంగా ఆవిర్భవించనుంది.

హైదరాబాద్లోని శంషాబాద్ లో నిర్మితమవుతున్న వరల్డ్ ట్రేడ్ సెంటర్(డబ్లూటీసీ) 2025 నాటికి పూర్తికానుంది. ఈ మేరకు డబ్ల్యూటీసీ శంషాబాద్ వైస్ చైర్మన్ వై వరప్రసాద్ రెడ్డి సోమవారం క్లారిటీ ఇచ్చాడు. దాదాపు 15 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 5 నుంచి 8 వేల మందికి ఉపాధి కల్పించగల ఈ సెంటర్ కు రూ.5000 నుంచి రూ. 8000 కోట్ల వరకు పెట్టుబడులు వస్తాయని ఆయన అన్నారు. శంషాబాద్ డబ్ల్యూటీసీ నిర్మాణం కోసం ఇప్పటి వరకు రూ.4 వేల కోట్లు వెచ్చించనున్నారు. వరల్డ్ ట్రేడ్ సెంటర్ విస్తీర్ణం పరంగా ఇప్పటివరకు ఢిల్లీ పరిధిలోని నోయిడాలో అతి పెద్దదిగా పేరు పొందింది. 44 ఎకరాల్లో ఇది విస్తరించి ఉంది. కానీ శంషాబాద్ సెంటర్ 50 నుంచి 60 ఎకరాల్లో విస్తరించి నిర్మించడం విశేషం.

ప్రపంచంలోనే అతిపెద్దదిగా నిర్మాణమవుతున్న శంషాబాద్ డబ్ల్యూటీసీలో కార్యాలయాలతో పాటు హోటళ్లు, కాన్ఫరెన్స్ హాళ్లు, అవుట్ లెట్ సౌకర్యాలు ఉంటాయి. ఇతర వరల్డ్ ట్రేడ్ సెంటర్ లాగే.. శంషాబాద్ డబ్ల్యూటీసీలో హోస్ట్ ట్రేడ్ మిషన్లు, అనువాద సేవలు, మార్కెట్ పరిశోధన, వ్యాపార సేవలు, నెట్ వర్కింగ్ ఈవెంట్స్ ఉంటాయి. అలాగే B2B మ్యాచ్ మేకింగ్, అంతర్జాతీయ పెట్టుబడులను స్వీకరించేందుకు అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నారు.

భారతదేశంలో శంషాబాద్ డబ్ల్యూటీసీ సెంటర్ ఆరోవది కానుంది. దీనితో పాటు ఏపీలోని విశాఖపట్నంలోని డబ్ల్యూటీసీ నిర్మాణానికి అనుమతులు వచ్చాయి. వీటి నిర్మాణాల్లో తేడాలు ఉన్నప్పటికీ అంతర్జాతీయ సేవలు మిగతా వాటిలాగే ఉంటాయని వైస్ చైర్మన్ వై వరప్రసాద్ రెడ్డి తెలిపారు. శంషాబాద్ డబ్ల్యూటీసీ ఒక పెట్టుబడి మాగ్నెట్ గా స్థానిక కంపెనీలను విస్తరించడంతో పాటు ఎఫ్ డీఐలను ఆకర్షించడానికి చానెల్ గా

ఇక కొత్త మార్కెట్లను, పెద్ద మార్కెట్లను స్థాపించడానికి ఇది ఒక వేదిక కానుంది. మార్కెట్ స్థాపించడానికి ఇక్కడ నిర్ణయించిన తరువాత ప్రభుత్వ అనుమతి కోసం పంపిస్తామని… రాష్ట్రానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు డబ్ల్యూటీసీ తోడ్పడుతుందని శంషాబాద్ డబ్ల్యూటీసీ డైరెక్టర్ అఖిలేష్ మాహుర్కర్ అన్నారు. ఇప్పటి వరకు చాలా కంపెనీలు, సంస్థలు కొవిడ్ బారిన బడ్డాయి. కొన్ని కోలుకున్నా.. మరికొన్ని పరస్తితి ఇంకా మెరుగుపడలేదు. ఈ నేపథ్యంలో డబ్ల్యూటీసీ అలాంటి స్ట్రాటప్ లకు అండగా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు.