సిగరెట్ తాగుతూ ’18 పేజెస్’ ఫస్ట్ లుక్ అప్డేట్ ఇచ్చిన నిఖిల్..!

0

 18 Pages  Update on Nikhil  18 Pages First Look Release dateయంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ – అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం ”18 పేజెస్”. పల్నాటి సూర్య ప్రతాప్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు సుకుమార్ ఈ చిత్రానికి స్టోరీ మరియు స్క్రీన్ ప్లే అందిస్తుండటం విశేషం. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రానికి సంబంధించిన అప్ డేట్ ని అందించబోతున్నట్లు చిత్ర బృందం ఇటీవలే ప్రకటించింది. ఈ క్రమంలో హీరో నిఖిల్ పుట్టిన రోజు సందర్భంగా జూన్ 1న ’18 పేజెస్’ ఫస్ట్ లుక్ ని విడుదల చేయనున్నట్లు మేకర్స్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ఈ సందర్భంగా నిఖిల్ కి సంబంధించిన ఓ పోస్టర్ ని రిలీజ్ చేశారు.

ఇందులో నిఖిల్ సిగరెట్ తాగుతూ.. కాలిపోతున్న ఓ పేజీని పట్టుకొని ఉన్నాడు. ఆ పేజీపై జూన్ 1న ’18 పేజెస్’ ఫస్ట్ లుక్ అని రాసి ఉంది. ఇంట్రెస్టింగ్ గా ఉన్న ఈ పోస్టర్ వీక్షకులను ఆకట్టుకుంటోంది. టైటిల్ తోనే సినిమాపై ఆసక్తిని కలిగించిన చిత్ర యూనిట్.. ఫస్ట్ లుక్ ని ఎలా డిజైన్ చేశారో చూడాలి. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై రానున్న ఈ చిత్రాన్ని బన్నీ వాసు నిర్మిస్తున్నారు. సుకుమార్ రైటింగ్స్ కూడా నిర్మాణ భాగస్వామి కావడంతో ఈ చిత్రంపై అంచనాలు పెరిగాయి. ఈ చిత్రానికి గోపీ సుందర్ సంగీతం సమకూరుస్తున్నారు. వసంత్ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. నవీన్ నూలి ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు.