నిహారిక పెళ్లి కోసం ఆసియాలోనే దిబెస్ట్ హోటల్

0

ఒక్కగానొక్క కూతురు.. మెగా వారసురాలు అందరికీ ముద్దుల అమ్మాయి.. అన్న స్టార్ హీరో.. ఇంకేంకావాలి.. అందుకే నిహారిక పెళ్లి విషయంలో ఎక్కడా తగ్గడం లేదు మెగా బ్రదర్ నాగబాబు. తన కూతురు పెళ్లిని ఆసియాలోనే ది బెస్ట్ హోటల్ లో చేస్తున్నారు.

నిహారిక పెళ్లిని అంగరంగ వైభవంగా చేసేందుకు మెగా ఫ్యామిలీ రెడీ అయ్యింది. చైతన్యతో ఆమె పెళ్లికి నాగబాబు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే వారింట మొదటి శుభకార్యం కావడంతో ఖర్చుకు వెనకాడకుండా .. వివాహాన్ని అందరికీ ఓ మధుర జ్ఞాపకంగా మిగిల్చేందుకు నాగబాబు ఫ్యామిలీ ప్లాన్ చేసింది.

ఈ క్రమంలోనే ఆసియాలోనే ది బెస్ట్ హోటల్ గా పేరొందిన ఒబెరాయ్ ‘ఉదయ్ విలాస్ ప్యాలెస్’ను నిహారిక-చైతన్య వివాహ వేదికగా నాగబాబు ఫ్యామిలీ ఎంపిక చేసింది.

డిసెంబర్ 9న ఈ ప్రఖ్యాత హోటల్ లో నిహారిక-చైతన్య వివాహం జరుగనుంది. ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం ఇప్పటికే నిహారిక-చైతన్య ఉదయ్ విలాస్ ప్యాలెస్ కు చేరుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా నిహారిక ‘ఉదయ్ విలాస్ ప్యాలెస్ ’లో ఉన్న ఫొటోను షేర్ చేసింది.

దేశంలోనే అపర కుబేరుడు ముఖేష్ అంబానీ కూతురు ఈశా సంగీత్ వేడుక కూడా ఈ ఉదయ్ విలాస్ లోనే జరగడం విశేషం. ఇప్పుడు నిహారిక పెళ్లి కూడా ఇక్కడే జరుగుతుండడం ప్రాధాన్యత సంతరించుకుంది.