ఆర్ఆర్ఆర్ : భీమ్ ఫర్ రామరాజు నెం.1

0

ఈమద్య కాలంలో స్టార్ హీరోల సినిమాల టీజర్ లు మరియు ట్రైలర్ ల యూట్యూబ్ వ్యూస్ మరియు లైక్స్ ను ఫ్యాన్స్ కౌంట్ చేసుకుంటూ తమ అభిమాన హీరో అత్యధిక వ్యూస్ సొంతం చేసుకున్నాడని… తమ స్టార్ అత్యధిక లైక్స్ దక్కించుకున్నాడు అంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. తాజాగా ఆర్ఆర్ఆర్ సినిమా నుండి వచ్చిన భీమ్ ఫర్ రామరాజు వీడియో యూట్యూబ్ లో అరుదైన రికార్డును దక్కించుకుంది. దాంతో మెగా మరియు నందమూరి అభిమానులు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు.

రామ్ చరణ్ బర్త్ డే సందర్బంగా విడుదలైన భీమ్ ఫర్ రామ రాజు వీడియోను యూట్యూబ్ లో ఇప్పటి వరకు 23.7 మిలియన్ ల మంది చూశారు. ఇక ఈ వీడియోకు యూట్యూబ్ లో 6.64 లక్షల మంది లైక్ కొట్టారు. టాలీవుడ్ చరిత్రలో ఇప్పటి వరకు ఏ సినిమా టీజర్ కు కాని ట్రైలర్ కు కాని సినిమా ప్రమోషన్ వీడియోకు కాని ఇంతటి స్థాయిలో లైక్స్ వచ్చింది లేదు. మొన్నటి వరకు ‘భరత్ అనే నేను’ టీజర్ 6.63 లక్షలతో నెం.1 గా ఉంది. ఇప్పుడు ఆ స్థానంను రామ్ చరణ్ దక్కించుకున్నాడు. ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ తో పాటు అద్బుతమైన విజువల్స్ ఉండటం వల్ల ప్రేక్షకులు విపరీతంగా ఈ వీడియోకు లైక్ కొట్టి టాలీవుడ్ నెం.1 గా నిలబెట్టారు.