బీచ్ సొగసుల వైజాగ్ లో `పుష్ప`కు దివ్యమైన ముహూర్తం ఫిక్స్

0

COVID-19 మహమ్మారి కారణంగా పదే పదే వాయిదా పడిన క్రేజీ సినిమాల జాబితాలో `పుష్ప` కూడా ఉంది. అల్లు అర్జున్న కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రష్మిక మందన అతడి సరసన కథానాయికగా నటిస్తోంది. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ ప్రాజెక్టు అన్ని డైలమాల నుంచి బయటపడి ఎట్టకేలకు సెట్స్ పైకి వెళ్లనుందిని తెలుస్తోంది.

అది కూడా బీచ్ సొగసుల వైజాగ్ లో `పుష్ప` కిక్ స్టార్ట్ అవుతోందన్న తాజా సమాచారం ఫ్యాన్స్ లో ఉత్సాహం పెంచుతోంది. నవంబర్ మొదటి వారం నుండి బన్ని- సుక్కూ బృందం షూట్ ప్రారంభించనున్నారు. అల్లు అర్జున్ అలాగే ఇతర చిత్ర బృందం నవంబర్ 6 నుండి వైజాగ్ లో షూటింగ్ ప్రారంభించి కంటిన్యూ షెడ్యూల్ చేస్తారట.

ఇప్పటికే పుష్ప నుంచి బన్ని ఫస్ట్ లుక్ ఈ ఏడాది ప్రారంభంలో విడుదలైంది. దీనికి సోషల్ మీడియాలో మంచి స్పందన వచ్చింది. ఇందులో బన్ని ఎర్రచందనం దుంగల్ని తరలించే లారీ డ్రైవర్ పాత్ర పోషిస్తున్నారని ఆ పోస్టర్ చూసి గెస్ చేశారు. పోస్టర్ లో అతడు రఫ్ అండ్ ఠఫ్ గా కనిపించడం అందరి దృష్టిని ఆకర్షించింది. చిత్తూరు శేషాచలం అడవుల్లో రియల్ ఎర్ర గంధపు చెక్క స్మగ్లింగ్ రాకెట్ చుట్టూ తిరిగే కథాంశం ఇదన్న ప్రచారం ఇప్పటికే వేడెక్కిస్తోంది. అయితే దీనిని చిత్రబృందం ఇంతవరకు కన్ఫామ్ చేయలేదు.

ప్రస్తుతానికి అల్లు అర్జున్ తన కుటుంబంతో కలిసి ఇంట్లో సాధారణ జీవితాన్ని గడుపుతుండగా.. రష్మిక తదుపరి చిత్రాల షూటింగ్ పూర్తి చేస్తోంది. దాదాపు 10 సంవత్సరాల తరువాత తన స్నేహితుడు సుకుమార్ తో కలిసి సినిమా చేస్తున్న బన్ని పుష్ప కోసం ఎంతో ఎగ్జయిటింగ్ గా వేచి చూస్తున్నారన్న సంగతి తెలిసినదే.