శ్రీదేవి దిగి వచ్చినట్లుగా ఉంది

0

అతిలోక సుందరి శ్రీదేవి ఆల్ ఇండియా స్టార్ డంను దక్కించుకుంది. కశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఆమెకు అభిమానులు ఉన్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అంతటి ఖ్యాతి అతి కొద్ది మంది హీరోయిన్స్ మాత్రమే దక్కించుకున్నారు. హిందీతో పాటు సౌత్ లో అన్ని భాషల్లో నటించిన శ్రీదేవి ఇండియన్ సినిమాపై తనదైన ముద్ర వేసింది. ఆమె చనిపోయిన సమయంలో అభిమానులు వ్యక్తపర్చిన భావోద్వేగాలే ఆమె స్టార్ డంకు నిదర్శనం. ఆమె చనిపోయి ఏళ్లు గడుస్తున్నా కూడా ఇంకా ఆమె జ్ఞాపకాల్లో అభిమానులు ఉన్నారు.

శ్రీదేవి తన కూతురు జాన్వీ కపూర్ ను హీరోగా చూడాలని ఆశపడినది. ఎన్నో కథలు విని ఎంతో మంది దర్శక నిర్మాతలతో చర్చించి చివరకు కరణ్ జోహార్ చేతిలో పెట్టింది. కూతురును హీరోయిన్ గా చూడకుండానే శ్రీదేవి కన్నుమూశారు. అయితే తల్లిని మరిపించేందుకు ఇప్పుడు కూతురు జాన్వీ కపూర్ ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. తల్లి నట వారసత్వంను పునికి పుచుకుని ఆమె స్థాయి నటిగా ఎదిగేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

ఇక జాన్వీ కపూర్ రెగ్యులర్ గా సోషల్ మీడియాలో ఫొటోలు షేర్ చేస్తూనే ఉంది. ఇటీవల గుంజన్ సక్సేనా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన జాన్వీ నటిగా విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. తాజాగా ఈ ఫొటో షూట్ స్టిల్స్ తో శ్రీదేవి దిగి వచ్చిందా అన్నట్లుగా అనిపిస్తుంది. తల్లి పోలికలతో పాటు అన్ని విధాలుగా శ్రీదేవిని పోలి ఉండటంతో జాన్వీ కపూర్ ఫొటోపై నెటిజన్స్ కామెంట్స్ లైక్స్ వర్షం కురిపిస్తున్నారు.