Templates by BIGtheme NET
Home >> Cinema News >> Keerthy Suresh: పెళ్లి పీటలు ఎక్కబోతున్న కీర్తి సురేష్.. వరుడు ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Keerthy Suresh: పెళ్లి పీటలు ఎక్కబోతున్న కీర్తి సురేష్.. వరుడు ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు!


Keerthy Suresh: అందం తో పాటు అద్భుతమైన నటన చూపించే హీరోయిన్స్ మన టాలీవుడ్ లో అతి తక్కువ మంది మాత్రమే ఉన్నారు. ఆ అతి తక్కువ మందిలో ఒకరే కీర్తి సురేష్, బాలనటిగా మలయాళం ఇండస్ట్రీ పరిచయమైనా కీర్తి సురేష్ ఆ తర్వాత పెద్దయ్యాక హీరోయిన్ ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి తనకంటూ సౌత్ లో ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని ఏర్పర్చుకుంది..మన టాలీవుడ్ కి ఈమె నేను శైలజ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీ కి పరిచయం అయ్యింది. ఈ సినిమా ద్వారా ఆమెకి వచ్చిన క్రేజ్ మామూలుది కాదు. తోలి సినిమానే బంపర్ హిట్ అవ్వడం తో కీర్తి సురేష్ కి తెలుగు, తమిళం బాషలలో వరుసగా స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలు దక్కాయి.

మధ్యలో ఈమె మహానటి వంటి లేడీ ఓరియెంటెడ్ సినిమా చేసి ఎంత పెద్ద సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మహానటి సావిత్రి గారి జీవిత చరిత్ర ని ఆధారంగా తీసుకొని తెరకెక్కించిన ఈ సినిమా 50 కోట్లకు పైగా షేర్ ని వసూలు చేసింది. ఈ సినిమా తర్వాత ఆమె ఒక పక్క హీరోయిన్ గా చేసుకుంటూనే మరో పక్క లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కూడా చేసుకుంటుంది. ఇటీవల కాలం లో వరుసగా ఫ్లాప్స్ ని ఎదురుకుంటున్న కీర్తి సురేష్ ని ఇటీవల విడుదలైన సర్కారు వారి పాట సినిమా హిట్ ట్రాక్ లోకి తెచ్చి పారేసింది..ఇది ఇలా ఉండగా కీర్తి అతి త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

గత కొంత కాలం నుండి ఈమె ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ తో ప్రేమలో ఉన్నట్టు..డేటింగ్ చేస్తునట్టు..త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నట్టు వార్తలు వినిపించాయి. అయితే ఇవన్నీ కేవలం రూమర్స్ మాత్రమేనని , కీతి సురేష్ ఒక ప్రముఖ పారిశ్రామిక వేత్తని పెళ్లాడబోతుందని, త్వరలోనే వీళ్లిద్దరి పెళ్ళికి సంబందించిన పూర్తి వివరాలను కీర్తి సురేష్ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా తెలియచేయనున్నారని తెలుస్తుంది. ప్రస్తుతం కీర్తి సురేష్ చేతినిండా సినిమాలు ఉన్నాయి..ఈ సినిమాలు పూర్తి చేసిన తర్వాత పెళ్లి చేసుకుంటుందా..లేదా పెళ్లి అయ్యాక ఈ సినిమాలను పూర్తి చేస్తుందా అనే విషయం తెలియాల్సి ఉంది..ప్రస్తుతం ఈమె తెలుగు లో హీరో నాని తో దసరా అనే సినిమాలో నటిస్తుంది..ఈ సినిమాతో పాటు మెగాస్టార్ చిరంజీవి హీరో గా తెరకెక్కుతున్న భోళా శంకర్ సినిమాలో చిరంజీవి కి చెల్లెలు గా నటిస్తుంది..ఈ రెండు సినిమాలతో పాటు తమిళం లో నాలుగు సినిమాలు మరియు వెబ్ సిరీస్ లతో కీర్తి సురేష్ తన క్యాలెండరు డైరీ మొత్తాన్ని నింపేసింది.