నాన్నపై ప్రియాంకా చోప్రా ఎమోషనల్ పోస్ట్!

0

బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి అంచెలంచెలుగా ఎదిగారు. ఆమె సినీ పరిశ్రమకు వచ్చి 20 ఏళ్లు పూర్తయ్యాయి. ప్రియాంక పలు భాషల్లో నటించారు. హాలీవుడ్ లోనూ సత్తా చాటారు. నిర్మాతగా గాయకురాలిగానూ ప్రతిభను చాటుకున్నారు. 2016లో ఆమెకు భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారాన్ని అందించింది. సినీ కెరీర్ 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రియాంక చోప్రా తన అభిమానులతో తన జీవిత విశేషాలను పంచుకున్నారు.

ఆమె తన నాన్నను ఎంతో ప్రేమిస్తారన్న విషయం తెలిసిందే. ఆమె చేతి మీద కూడా డాడీస్ లిటిల్ గర్ల్ అనే టాటూను వేయించుకున్నారు. అంతకంటే సందర్భం వచ్చినప్పడల్లా ఆమె నాన్నను గుర్తుచేసుకుంటారు. అయితే పద్మశ్రీ అవార్డు రావడం తన జీవితంలో ఎంతో ముఖ్యమైన రోజని ప్రియాంక చెప్పారు. తాను అవార్డు తీసుకుంటేంటే నాన్న తనతో లేకపోవడం ఎంతో లోటని ఆమె చెప్పారు.

‘ నాన్న మీరు నాకు ఎంతో ప్రత్యేకం. పద్మశ్రీ పురస్కారం అందుకోవడం నా జీవితంలో ఓ గొప్పరోజు. కానీ అప్పుడు మీరు నాతో లేరు. ఇది నాకు చాలా బాధగా అనిపించింది. మీరు నాతో లేకపోయినా మీ ఆలోచనలు దీవెనలు ఎప్పుడూ నన్ను వెన్నంటే ఉంటాయి. ఈ అవార్డు నా కుటుంబానికి గౌరవాన్ని పెంచింది. ఆ రోజు మా కుటుంబసభ్యులంతా రాష్ట్రపతి భవన్కు వచ్చారు. అక్కడ మా నాన్న ఒక్కరే మిస్ అయ్యారు. ఇప్పుడు భౌతికంగా ఆయన లేనప్పటికీ.. ఎప్పటికీ నాతోనే ఉంటారు. ఐ మిస్యూ డాడీ’ అంటూ ఆమె ట్వీట్ చేశారు.