మహేష్ – పూరీ కాంబోలో హ్యాట్రిక్ మూవీ…?

0

సూపర్ స్టార్ మహేష్ బాబు – డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వీరిద్దరి కలయికలో వచ్చిన చిత్రాలు టాలీవుడ్ లో రికార్డులు నమోదు చేసాయి. మహేష్ – పూరీ కాంబోలో వచ్చిన ‘పోకిరి’ చిత్రం అప్పటి వరకు తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న అన్ని రికార్డులను తిరగరాసింది. మహేష్ బాబులోని కొత్త యాంగిల్ ను ఆవిష్కరిస్తూ పండుగాడుతో పలికించిన డైలాగులు ఇప్పటికీ ప్రేక్షకుల మైండ్ లో ఉన్నాయి. ఇక మహేష్ బాబు – పూరీ జగన్నాథ్ కలయికలో వచ్చిన ‘బిజినెస్ మ్యాన్’ సినిమా సినిమా కూడా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ క్రమంలో వీరి కాంబోలో హ్యాట్రిక్ ప్రాజెక్ట్ గా ‘జనగణమన’ అనే సినిమాని ప్రకటించారు. కానీ ఎందుకో ఈ ఈ ప్రాజెక్ట్ కార్యరూపం మాత్రం దాల్చడం లేదు. అంతేకాకుండా అప్పటి నుంచి ఇద్దరి మధ్య దూరం పెరుగుతూ వచ్చింది. అయితే ఇప్పుడు మళ్ళీ మహేష్ – పూరీ కాంబినేషన్ లో సినిమా చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తోంది.

మహేష్ బాబు – పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో మరో సినిమా తీయాలని అభిమానులు పలు సందర్భాలలో ఇద్దరినీ ప్రశ్నించారు. ‘సర్కారు వారి పాట’ అనౌన్స్ మెంట్ రోజు ఫ్యాన్స్ తో ఇంస్టాగ్రామ్ లో చిట్ చాట్ చేసిన మహేష్.. పూరీ తన అభిమాన సినీ దర్శకులలో ఒకరని.. తన వద్దకు వచ్చి ఎప్పుడు కథ చెబుతాడా అని ఎదురు చూస్తున్నానని తన మనసులో మాట బయటపెట్టాడు. ఈ మధ్య పూరీ బర్త్ డే కి ట్వీట్ చేసిన మహేష్ తమ మధ్య విబేధాలు లేవని చెప్పే ప్రయత్నం చేశారు. దీంతో బ్లాక్ బాస్టర్ కాంబో మరోసారి కలిసే అవకాశం ఉందని ఫ్యాన్స్ అనుకున్నారు. ఇప్పుడు మహేష్ – పూరీ కలయికలో సినిమా చేయడానికి స్టార్ ప్రొడ్యూసర్ అనిల్ సుంకర ట్రై చేస్తున్నారని సమాచారం. ‘సరిలేరు నీకెవ్వరు’ వంటి సూపర్ హిట్ తర్వాత ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో మరో సినిమా చేయడానికి మహేష్ ఒప్పుకున్నాడు. ఈ నేపథ్యంలో మహేష్ హీరోగా పూరీతో ఓ ప్రాజెక్ట్ కోసం అనిల్ సుంకర డిస్కషన్ జరిపారట. మరి ఈ ప్రాజెక్ట్ ఓకే అయి హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ వస్తుందేమో చూడాలి. ఇదిలా ఉండగా మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ సినిమా చేస్తున్నాడు. అలానే దర్శకధీరుడు రాజమౌళి – త్రివిక్రమ్ శ్రీనివాస్ లతో సినిమాలు చేయనున్నాడు.