సూసైడ్ ఆలోచన మంచిదని ఎంత బాగా చెప్పావ్ పూరి?

0

ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన పిరికివాళ్లకే వస్తుందని అంటారు. కానీ పూరి ఏమిటి ఇలా అనేశారు. కేవలం ధైర్యవంతులు మాత్రమే ఆత్మహత్య చేసుకోగలరు అంటూ క్లాస్ తీస్కోవడమే గాక.. సూసైడ్ ఆలోచన ఉంటే నాకు చాలా రెస్పెక్ట్ అని కూడా అన్నారు పూరి. పూరి మ్యూజింగ్స్ లో ఇదో స్పెషల్ ట్విస్టు.

లైఫ్ లో ఎన్నోసార్లు మనమీద మనకే చిరాకు దొ.. ద్ది.. ఛీ యదవ జీవితం చచ్చిపోవాలనిపిస్తుంది. మనలో చాలా మందికి ఈ ఆలోచన వచ్చి ఉంటుంది. సూసైడ్ ఆలోచన ఉంటే నాకు చాలా రెస్పెక్ట్ ఎందుకంటే ఈ ఆలోచన ఓన్లీ ఇంఎలిజెంట్స్ కే వస్తుంది అని అన్నారు పూరి.

అందరూ అంటారు.. పిరికివాళ్లే ఆత్మహత్య చేసుకోవాలనుకుంటారని .. కానేకాదు.. నిపోవాలనుకున్నవాడే ధైర్యవంతుడు. ప్రాణం వదిలేసే దమ్ము చాలా కొద్దిమందిలో ఉంటుంది. అయినా ఎందుకు చనిపోవాలనుకుంటున్నావ్? కొన్ని సమస్యలేవో ఉంటాయి. ప్రేమ ఫెయిలో.. క్రైమ్ వల్లనో ఇంకేదో..

బాధ్యత తీసుకునేవారే ఇలాంటి మనస్తత్వంతో ఉంటారు. బాధ్యత లేని వాళ్లు ఇలా ఆలోచించరు.
నీకు ప్రేమించే ధైర్యం ఉంది.. ఎవరైనా మాట అంటే పడవు. ఆత్మాభిమానం ఎక్కువ. పైగా ఇంటెలిజెన్స్ వి. దానికి తోడు చచ్చేంత ధైర్యం దమ్ము ఉంది.. ఇవన్నీ హీరో లక్షణాలు.. నువ్వు హీరోవి.. నువ్వు చావడమేంటి? సినిమాల్లో ఇలాంటి హీరోల్ని చూసే బిజినెస్ చేస్తాం. అలాంటి నువ్వు మా మధ్య ఉన్నావ్.

ఈ మనుషులు డ్రామాలు నీకు చిరాకు తెప్పించవచ్చు. కానీ సమస్యతో పోరాడు.. ఏ సమస్య కోసం నువ్వు చావాలనుకుంటున్నావో ఆ సమస్యను పరిష్కరించు.. నిన్ను నమ్ముకున్న వాళ్ల కోసం.. ఆ సమస్య పరిష్కరించాకా చావాలనుకుంటే చనిపో. కానీ ఒక చిన్న సమస్య గురించి చనిపోవడం సరికాదు. నిన్ను ఇబ్బంది పెడుతున్నదెవరో వాళ్లను చావగొట్టు.

అప్పులు చేశావా? వేధిస్తే జిప్ విప్పి చూపించు.. ప్రేమించి మోసం చేశారా పట్టించుకోకు.
ప్రేమించావా? నువ్వు ఉండు నాతో అని అడుగు. చుట్టూ చెత్తగాళ్లు ఎందుకు? వాళ్లు పోవాలి. నువ్వు కాదు. చావడానికి సిద్ధంగా ఉన్నవాళ్లను ఎవడూ చంపలేడు. మనమంతా లైఫ్ లో అలానే ఉన్నాం… అంటూ పూరి ఓదార్చిన తీరు నభూతోనభవిష్యతి. అన్నట్టు పూరి కూడా ఫ్రస్టేషన్ లో ఆత్మహత్యా యత్నం చేశాడా? అన్నది మాత్రం చెప్పలేదు. ఆయన ఫ్రెండు పవన్ కల్యాణ్ మాత్రం ఆత్మహత్యా యత్నం చేశానని బహిరంగ వేదికపైనే ప్రకటించారు.

 

View this post on Instagram

 

‪👉 https://youtu.be/QbGKy8lZovQ @charmmekaur #PC

A post shared by Puri Connects (@puriconnects) on