ఆరోగ్యం రాజకీయం పై పుకార్లకు రజినీ చెక్

0

నిన్నటి నుండి రజినీకాంత్ అనారోగ్య కారణాల వల్ల రాజకీయ అరంగేట్రం చేయబోవడం లేదని.. రాజకీయాలకు తాను గుడ్ బై చెప్పాలనుకుంటున్నట్లుగా పేర్కొంటూ ఒక లేఖ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. రజినీకాంత్ కు గతంలో కిడ్నీ మార్పిడి జరిగింది. అందువల్ల రోగ నిరోదక శక్తి చాలా తక్కువగా ఉంటుంది. ఒక వేళ కరోనా ఎటాక్ అయితే చాలా ప్రమాదం. అందుకే ఇలాంటి సమయంలో పార్టీ పెట్టి బయట తిరగడం సాధ్యం అయ్యే పని కాదు. అందుకే తాను రాజకీయాల్లోకి వెళ్లకుండానే రాజకీయంకు గుడ్ బై చెప్పాలని భావిస్తున్నట్లుగా ఒక ప్రెస్ నోట్ ప్రచారం జరిగింది. నిన్నటి నుండి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ ప్రెస్ నోట్ నిజం కాదని తాను దాన్ని విడుదల చేయలేదు అంటూ రజినీకాంత్ నేడు ట్విట్టర్ లో అధికారికంగా క్లారిటీ ఇచ్చాడు.

నిన్నటి నుండి వైరల్ అవుతున్న ఆ ప్రెస్ నోట్ ను నేను ఇవ్వలేదు. అయితే అందులో అన్ని నిజాలు కాదు అన్ని అబద్దాలు కావు. రాజకీయాల విషయంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అభిమానులతో చర్చించిన తర్వాత రాజకీయల విషయమై ఒక నిర్ణయం తీసుకుంటాను. అలాగే తన ఆరోగ్యం గురించి వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవం. నేను కరోనాతో బాధపడుతున్నట్లుగా వస్తున్న వార్తలు నిజం కాదు. నాకు అనారోగ్య సమస్యలు ఏమీ లేవు అంటూ రజినీకాంత్ ట్విట్టర్ లో షేర్ చేశాడు. నేను సొంతంగా ఎలాంటి నిర్ణయం తీసుకోవాలని అనుకోవడం లేదు. అందరితో చర్చించిన తర్వాతే రాజకీయ విషయమై ఒక నిర్ణయం తీసుకుంటాను అంది.