త్రివిక్రమ్ రచన సహకారంకే అంత పారితోషికమా?

0

పవన్ కళ్యాణ్ హీరోగా సితార ఎంటర్ టైన్మెంట్స్ వారు ఒక సినిమాను అధికారికంగా ప్రకటించిన విషయం తెల్సిందే. ఆ సినిమా మలయాళ సూపర్ హిట్ మూవీ అయ్యప్పనుమ్ కోషియుమ్ కు రీమేక్ అంటూ బలంగా వార్తలు వస్తున్నాయి. ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించనప్పటికి ఇండస్ట్రీ వర్గాల వారితో పాటు సితార ఎంటర్ టైన్మెంట్స్ వాళ్లు కూడా అనధికారికంగా నిర్థారిస్తున్నారు. సాగర్ చంద్ర దర్శకత్వంలో ఈ సినిమాను పవన్ కళ్యాణ్ చేయబోతున్నాడు. మొదట ఈ రీమేక్ కోసం పలువురు సీనియర్ స్టార్స్ ను సంప్రదించారు. కాని ఎవరు కూడా ముందుకు రాలేదు.

రీమేక్ రైట్స్ తీసుకున్న సితార వాళ్లు ఈ ప్రాజెక్ట్ లోకి త్రివిక్రమ్ ను తీసుకు వచ్చారు. రీమేక్ స్క్రిప్ట్ రచనకు త్రివిక్రమ్ సహకారం అందించాడు. త్రివిక్రమ్ హ్యాండ్ పడటం వల్లే పవన్ రీమేక్ లో నటించేందుకు ఓకే చెప్పినట్లుగా వార్తలు వస్తున్నాయి. అందుకే ఈ సినిమాకు సమర్పకుడిగా త్రివిక్రమ్ వ్యవహరించబోతున్నాడు అంటున్నారు. ఇక సినీ వర్గాలు మరియు మీడియా సర్కిల్స్ నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ రీమేక్ కు రచన సహకారం అందించినందుకు ముందు ముందు అందించబోతున్న సహకారంకు గాను త్రివిక్రమ్ ఏకంగా రూ.10 కోట్ల వరకు పారితోషికంగా అందుకోబోతున్నాడట.

ఆ సినిమా దర్శకుడు అయినా కూడా అంత పారితోషికం తీసుకుని ఉండడు. అలాంటిది త్రివిక్రమ్ కు ఆ స్థాయిలో పారితోషికం ఇస్తున్నారు అంటే ఆయన సహకారం ఏ పాటిదో అర్థం చేసుకోవచ్చు. మరో వైపు ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ మూవీకి రెడీ అవుతున్న విషయం తెల్సిందే. ఈ రీమేక్ కోసం పవన్ కేవలం నెలన్నర రోజులకు తక్కువే వర్క్ చేయబోతున్నాడట. ఇక రీమేక్ లో నటించబోతున్న మరో హీరో విషయమై ప్రస్తుతం ఆసక్తికర చర్చ జరుగుతోంది.