సిక్స్ ప్యాక్ బాడీ ఆ యువ హీరోని సక్సెస్ ట్రాక్ ఎక్కించేనా…?

0

టాలీవుడ్ యువ హీరో నాగ శౌర్య ‘చందమామ కథలు’ సినిమాలో సపోర్టింగ్ రోల్ ప్లే చేసి ‘ఊహలు గుసగుసలాడే’ సినిమాతో హీరోగా మారాడు. ఫస్ట్ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో వరుస అవకాశాలు అందుకున్నాడు. ఈ క్రమంలో ‘కల్యాణ వైభోగమే’ ‘దిక్కులు చూడకు రామయ్యా’ ‘జ్యో అచ్యుతానంద’ ‘ఒక మనసు’ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత వచ్చిన ‘ఛలో’ సినిమాలతో సూపర్ హిట్ అందుకున్నారు శౌర్య. యూత్ హీరోగా ముఖ్యంగా అమ్మాయిల్లో ఫుల్ ఫాలోయింగ్ ఉన్న ఈ యంగ్ హీరోకు సరైన సోలో హిట్టు పడి చాలా కాలమే అయింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ప్రారంభంలో ‘అశ్వథ్థామ’ అనే సినిమాను తనే స్వయంగా స్టోరీ రాసి నిర్మించాడు. ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా బాక్సాఫీస్ వద్ద యావరేజ్ సినిమాగా మిగిలిపోయింది. ఈ క్రమంలో నెక్స్ట్ ప్రాజెక్ట్స్ విషయంలో నాగ శౌర్య మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.

కాగా ప్రస్తుత పరిస్థితుల్లో ఇంటికే పరిమితమైన శౌర్య బాడీ ఫిట్నెస్ మీద ఫోకస్ పెట్టాడు. ఇంట్లోనే జిమ్ ని సెట్ చేసుకొని వర్కౌట్స్ చేస్తున్న శౌర్య నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం కండలు తిరిగిన దేహాన్ని రెడీ చేసాడు. తన కెరీర్లో 20వ చిత్రంగా రాబోతున్న స్పోర్ట్స్ డ్రామా ఫస్ట్ లుక్ లో ఈ యువ హీరోని చూసిన చాలా మంది అసలు నాగ శౌర్యేనా అనే డౌట్ వ్యక్తం చేసారు. టాలీవుడ్ లో తన లాగే లవ్ స్టోరీస్ తో కెరీర్ స్టార్ట్ చేసి తన కంటే ముందుకు వెళ్ళిపోయిన విజయ్ దేవరకొండ – వరుణ్ తేజ్ వంటి హీరోలు కూడా ఇప్పుడు స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో సినిమాలు చేస్తూ సిక్స్ ప్యాక్ బాడీలు మైంటైన్ చేస్తున్నారు. ఇప్పుడు నాగ శౌర్య కూడా తన రూటు మార్చేసి సిక్స్ ప్యాక్ అండ్ యాక్షన్ డ్రామాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి తన కెరీర్ ని గాడిన పెట్టుకోవాలని ట్రై చేస్తున్నాడని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. ఇప్పటి వరకు లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ చేస్తూ ఫ్యామిలీ ఆడియన్స్ కి దగ్గరైన నాగశౌర్య మాస్ ఆడియన్స్ ని ఆకట్టుకోవాలని చేస్తున్న ప్రయత్నాలు ఎంత వరకు సక్సెస్ అవుతాయో చూడాలి.