Templates by BIGtheme NET
Home >> Cinema News >> ‘నీ అహంకారం నేలమట్టం అవుతుంది’ అంటూ సీఎం కి వార్నింగ్…!

‘నీ అహంకారం నేలమట్టం అవుతుంది’ అంటూ సీఎం కి వార్నింగ్…!


బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ‘ముంబైలో అడుగుపెడుతున్నా.. దమ్ముంటే అడ్డుకోండి’ అంటూ శివసేన కార్యకర్తలకు సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. చెప్పినట్లుగానే కంగనా ఇవాళ ముంబాయిలో అడుగుపెట్టారు. అదే సమయంలో మహారాష్ట్ర ప్రభుత్వం బాంద్రాలోని కంగనా మణికర్ణిక కార్యాలయాన్ని కూల్చివేయడం మొదలు పెట్టింది. నిబంధనలకు విరుద్ధంగా కార్యాలయాన్ని నిర్మించారనే ఆరోపణలతో కూల్చివేత కార్యక్రమాన్ని చేపట్టినట్లు బృహన్ ముంబై కార్పొరేషన్(బీఎంసీ) అధికారులు తెలిపారు. దీనిపై ఘాటుగా స్పందించిన కంగనా.. ‘మహారాష్ట్ర గౌరవం కోసం తాను రక్తం ధారపోయడానికి సిద్ధంగా ఉన్నానని.. తనకు ఆస్తి అతి చిన్న విషయమని.. ఇవేవీ తన ఆత్మస్థైర్యాన్ని తగ్గించవని పైపెచ్చు పెంచుతాయని మహా ప్రభుత్వానికి కౌంటర్ ఇచ్చారు కంగనా. పరోక్షంగా తన కార్యాలయాన్ని రామమందిరంతో పోల్చుకుంటూ బాబర్ అతని సైన్యం తన ఆఫీసును కూల్చివేస్తున్నారంటూ చెప్పుకొచ్చారు. ‘తానెప్పుడూ తప్పు చేయలేదని.. తన శత్రువులు మాత్రం తన మాటలను మళ్ళీ మళ్ళీ నిజం చేస్తున్నారని.. ఇప్పుడు నిజంగా ముంబై పాక్ ఆక్రమిత కశ్మీర్ ని తలపిస్తోందని’ కంగనా ట్వీట్ చేశారు. ఈ క్రమంలో కంగనా రనౌత్ వీడియో ద్వారా మరోసారి నిప్పులు చెరిగింది. ఈసారి డైరెక్ట్ గా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేను ఏకవచనంతో సంభోధిస్తూ సవాల్ విసిరి సంచలనం సృష్టించింది.

కంగనా మాట్లాడుతూ.. ”ఉద్ధవ్ థాకరే నీవేమనుకుంటున్నావ్?. సినీ మాఫియాతో కలిసి నా ఇళ్లు పడగొట్టి ఆనందపడుతున్నావా?. ఇవాళ నా ఇళ్లు ధ్వంసమైంది. రేపు నీ అహంకారం నేలమట్టమవుతుంది. ఇది కాలానుగుణంగా జరిగేదే. గుర్తుంచుకో కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. నాకు ఓ విధంగా నీవు మంచే చేశావనిపిస్తోంది. ఎందుకంటే నాకు తెలుసు కశ్మీరీ పండిట్లపై ఏం జరిగిందో. ఇవాళ నాకు అనుభవమైంది. నేను దేశానికి మాట ఇస్తున్నా. నేను అయోధ్యపైనే కాదు కాశ్మీర్ పై కూడా ఓ సినిమా తీస్తాను. నా దేశ ప్రజల్ని చైతన్య పరుస్తాను. ఎందుకంటే నాపై ఏం జరిగినా జరుగుతుంది. దీనివెనుక వేరే కారణాలున్నాయి. వేరే ఉద్దేశ్యాలున్నాయి. ఉద్ధవ్ ధాకరే.. ఈ క్రూరత్వం.. ఈ అరాచకం నా పై జరగడం మంచికే అయింది. జై హింద్. జై మహారాష్ట్ర” అని పేర్కొంది. ప్రస్తుతం కంగనా మహారాష్ట్ర సీఎం ని వార్నింగ్ ఇచ్చే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

तुमने जो किया अच्छा किया