Templates by BIGtheme NET
Home >> Cinema News >> బిగ్ బాస్ టైమింగ్ మారుతుందా?

బిగ్ బాస్ టైమింగ్ మారుతుందా?


బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే జోన్ లోకి ఎంటరైంది. అయినా రేటింగ్ మాత్రం సోసోగానే నమోదవుతుండటంతో మేకర్స్ ఈ విషయంలో చాలా అసంతృప్తితో వున్నారట. కోవిడ్ టైమ్ లో ధైర్యం చేసి ప్రారంభించిన ఈ రియాలిటీ షో టీఆర్పీ రేటింగ్ క్రమ క్రమంగా తగ్గుతూ వస్తోంది. దానికి ప్రధాన కారణం బిగ్ బాస్ వ్యవహరిస్తున్న తీరే అని విమర్శలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ షో గ్రాండ్ ఫినాలేకి ఎంటర్ అయిన క్రమంలో టీఆర్పీ రేటింగ్ క్రమంగా పుంజుకుంతోంది.

ఈ దశలో బిగ్ బాస్ మేకర్స్ సంచలన నిర్ణయానికి రావడం ప్రాధాన్యతని సంతరించుకుంది. బిగ్ బాస్ టైమింగ్ స్లాట్ ని మారుస్తూ నిర్వాహకులు తాజాగా ప్రోమోని విడుదల చేయడం ఆసక్తికరంగా మారింది. ప్రతీ సోమవారం నుంచి శుక్రవారం వరకు బిగ్ బాస్ రాత్రి 9:30 నిమిషాల నుంచి 10:30 నిమిషాల వరకు ప్రసారం అవుతోంది. ఇక వీకెండ్ లో మాత్రం రాత్రి 9:00 గంటల నుంచి 10:30 గంటల వరకు ప్రసారం అవుతోంది. అయితే డిసెంబర్ 7 నుంచి మాత్రం బిగ్ బాస్ రాత్రి 10:00 గంటలకు ప్రసారం కానుందని తెలిసింది. బిగ్ బాస్ స్లాట్ లో `వదినమ్మ` సీరియల్ ప్రసారం కాబోతోంది.

ఇంతకు ముందు ఈ సీరియల్ రాత్రి 7:00 గంటలకు ప్రసారం అయ్యేది. అయితే డిసెంబర్ 7నుంచి ఆ స్లాట్లో `గుప్పెడంత మనసు` కొత్త సీరియల్ ప్రారంభం అవుతోంది. దాంతో బిగ్ బాస్ టైమింగ్స్ ని మార్చేశారు. షో గ్రాండ్ ఫినాలేకి చేరింది కాబట్టి ఆడియన్స్ ఏ స్లాట్ లో ప్రసారం చేసినా చూస్తారనే నమ్మకంతో బిగ్ బాస్ మేకర్స్ ఈ సాహసానికి పూనుకుంటున్నారు. ఛానల్ కి టీఆర్పీని.. పాపులారిటీని తీసుకొస్తున్న షో టైమింగ్ ని ఉన్నట్టుండి మార్చడం ఆ ఛానల్ కే ప్రమాదమని కొంత మంది విమర్శలు గుప్పిస్తున్నారు.