కిమ్ అంకుల్ హత్యలో ట్రంప్ హస్తం : రేజ్ బుక్ !

0

అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తోన్న సమయంలో రెండోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్న దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే కరోనాను వ్యాప్తి చెందడాన్ని నివారించడంలో డొనాల్డ్ ట్రంప్ విఫలం అయ్యారంటూ డెమొక్రాట్ల అధ్యక్ష అభ్యర్థి జో బిడెన్ ఆరోపణలు చేస్తున్నారు. ట్రంప్ కు ఏ మాత్రం చిత్తశుద్ధి లేదంటూ స్వయానా ఆయన సోదరి మాట్లాడినట్టుగా ఆడియో టేపులు వెలుగులోకి రావడం మరింత ఇరకాటంలో పడేశాయి. ఈ పరిస్థితుల్లో ట్రంప్ ఇబ్బందులను మరింత పెంచేలా చేస్తోంది రేజ్ బుక్.

ప్రముఖ జర్నలిస్ట్ బాబ్ వుడ్ వర్డ్స్ రాసిన పుస్తకం అది. రేజ్ పేరుతో ఇది మార్కెట్ లోకి అందుబాటులోకి వచ్చింది. ట్రంప్ ఫోటోతో దీన్ని ముద్రించారు. డొనాల్డ్ ట్రంప్ కు సంబంధించిన కొన్ని కీలక అంశాలను ఇందులో ప్రస్తావించినట్లు చెబుతున్నారు. ప్రత్యేకించి ఈ నాలుగేళ్ల కాలంలో ట్రంప్ అనుసరించిన విదేశాంగ విధానాలు కోవిడ్ పరిస్థితులను ఎదుర్కొనడానికి తీసుకున్న చర్యలు చైనాపై అమెరికా ఎలాంటి వైఖరిని ప్రదర్శించిందనే విషయాలపై ఈ పుస్తకంలో బాబ్ వుడ్ వర్డ్స్ చర్చించినట్లు తెలుస్తోంది.

ఈ బుక్ ట్రంప్ ను రాజకీయంగా ఇబ్బందులకు గురి చేసేదిగా అంచనా వేస్తున్నారు. అన్నింటికంటే కిమ్ జొంగ్ ఉన్ మామ దారుణ హత్యకు సంబంధించిన సమాచారం ఇప్పుడు హాట్ టాపిక్ గా రేపుతోంది. కిమ్ జొంగ్ ఉన్ మామ కిమ్ జొంగ్-నామ్ 2017 ఫిబ్రవరి 13వ తేదీన మలేసియా రాజధాని కౌలాలంపూర్ విమానాశ్రయంలో హత్యకు గురయ్యారు. ఉత్తర కొరియా ఏజెంట్లే ఆయనను హత్య చేసి ఉంటాయంటూ అప్పట్లో అనుమానాలు వెల్లువెత్తాయి. ఇదే అంశాన్ని బాబ్ వుడ్ వర్డ్స్ తాను రాసిన రేజ్ పుస్తకంలో ప్రస్తావించారు. ఈ హత్యలో డొనాల్డ్ ట్రంప్ ప్రమేయం కూడా ఉండొచ్చనే అనుమానాలను వ్యక్తం చేశారు. 46 సంవత్సరాల కిమ్ జొంగ్- నామ్ మకావులో నివసిస్తున్నారు. అక్కడికి వెళ్లే ప్రయత్నంలో విమానాశ్రయానికి చేరుకోగా ఈ దాడి చోటు చేసుకుంది.

ఆ సమయంలో డొనాల్డ్ ట్రంప్.. కిమ్ లేఖ రాశారని ఎలాంటి సహాయమైనా అందిస్తానని హామీ ఇచ్చారని బాబ్ వుడ్వర్డ్స్ పేర్కొన్నారు. తాను ఇదివరకు ట్రంప్తో నిర్వహించిన ఇంటర్వ్యూలో కిమ్ ను ప్రశంసించారని నామ్ హత్యోదంతంపై కిమ్ సమాచారం ఇచ్చినట్లు ట్రంప్ తన ఇంటర్వ్యూలో స్పష్టం చేశారని బాబ్ తెలిపారు . ట్రంప్-కిమ్ మధ్య ఈ హత్యకు డీల్ కుదరిందనే సమాచారం ఏదీ తమ వద్ద లేదని వెల్లడించినట్లు తెలిపారు. అధికారం కోసం ఎంతకైనా తెగిస్తారనే ఆరోపణలు కిమ్జొంగ్ మీద ఉన్నాయి. తన అధికారానికి అడ్డుగా వస్తారని భావించిన ప్రతి ఒక్కరినీ ఆయన హతమార్చారంటూ ఇప్పటికే పలు వార్తలు వెలువడ్డాయి. కిమ్జొంగ్ నామ్ను కూడా ఆ కారణంతోనే హత్య చేయించి ఉండారని అప్పట్లో వార్తలు వెలువడ్డాయి