Templates by BIGtheme NET
Home >> Cinema News >> రవితేజ చేతిలో ఓడిపోయిన శృతిహాసన్..!

రవితేజ చేతిలో ఓడిపోయిన శృతిహాసన్..!


అందాల ముద్దుగుమ్మ శృతి హసన్ ప్రస్తుతం మాస్ మహారాజ్ రవితేజ సరసన ”క్రాక్” సినిమాలో నటిస్తోంది. తెలుగులో మూడేళ్ళ గ్యాప్ తర్వాత ఈ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ కి గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నారు. ఇంతకముందు శృతి – రవితేజ – గోపీచంద్ మలినేని కాంబోలో వచ్చిన ‘బలుపు’ సినిమా విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మళ్లీ వీరి కలయికలో వస్తున్న ‘క్రాక్’ సినిమాని సంక్రాంతి కి విడుదల చేయడానికి రెడీ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ఫైనల్ షెడ్యూల్ కోసం చిత్ర యూనిట్ మొత్తం గోవాలో స్టే చేసింది. షూటింగ్ ని ఎంజాయ్ చేస్తున్న శ్రుతి హాసన్ ఈ సందర్భంగా రవితేజతో ప్లాన్క్ ఛాలెంజ్ లో పోటీ పడింది. దీనికి సంబంధించిన ఓ వీడియో షేర్ చేసింది.

ఈ వీడియోలో రవితేజతో పోటీపడిన శృతి హాసన్ ఓడిపోయింది. ‘క్రాక్’ షూటింగ్ సరదాగా జరిగిపోయిందని.. రవితేజతో రెండోసారి కూడా మోస్ట్ ఫన్నీ గా సాగిందని.. ఈ టీమ్ లో భాగం చేసినందుకు డైరెక్టర్ గోపీచంద్ కి థ్యాంక్స్.. సంక్రాంతి కి ఫ్యామిలీతో కలసి క్రాక్ సినిమా చూడమని శృతి హాసన్ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. కాగా వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని సరస్వతి ఫిలిమ్స్ డివిజన్ బ్యానర్ పై బి. మధు నిర్మిస్తున్నారు. ఇందులో రవితేజ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన ‘క్రాక్’ ఫస్ట్ లుక్ మరియు టీజర్ లకు విశేష స్పందన వచ్చింది. ‘డాన్ శీను’ ‘బలుపు’ చిత్రాల తర్వాత గోపీచంద్ మలినేని – రవితేజ కాంబినేషన్ లో వస్తున్న ఈ హ్యాట్రిక్ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Shruti Haasan (@shrutzhaasan)