పారితోషికంలో చుక్కలు చూపిస్తోందట!!

0

కెరీర్ పరంగా శ్రుతిహాసన్ డైలమా గురించి తెలిసిందే. ఇంతకుముందు స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగినా మైఖేల్ కోర్సలేతో ప్రేమాయణం వల్ల వ్యక్తిగత జీవితానికి ప్రాధాన్యతనిచ్చి ఇండస్ట్రీకి దూరమైంది. నాలుగైదేళ్ల గ్యాప్ తర్వాత తిరిగి నటనలోకి రీఎంట్రీ ఇచ్చింది. పూర్తిగా పరిశ్రమను వదిలి వెళ్లిపోతోందని అనుకుంటే కథంతా అడ్డం తిరిగింది.

అయితే చక్కనమ్మకు రీఎంట్రీలోనూ ఆఫర్లకు కొదవేమీ లేదు. ఇటు తెలుగు అటు తమిళం రెండుచోట్లా క్రేజీ గా అవకాశాలు అందుకుంటోంది. ప్రస్తుతం తమిళంలో విజయ్ సేతుపతి సరసన ఓ సినిమా చేస్తున్న శ్రుతి రవితేజ సరసన తెలుగులో క్రాక్ మూవీలో నటించింది. తదుపరి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సరసన వకీల్ సాబ్ లో నటిస్తోంది.

అయితే శ్రుతి ఈ మూవీకి అంగీకరించడానికి ముందు కొన్ని డిమాండ్లు చెప్పిందట. తన పాత్ర పరిధి ఎంతైనా కానీ ఫుల్ రెమ్యునరేషన్ ఇవ్వాలని కోరిందట. అతిథి పాత్ర అయినా పెద్ద మొత్తాన్ని డిమాండ్ చేసిందట. అసలే సీనియర్ హీరోలకు కథానాయికల కొరత వేధిస్తోంది. ఇలాంటప్పుడు అమ్మడిని ఒప్పించేందుకు మేకర్స్ అన్ని డిమాండ్లకు తలొగ్గాల్సి వచ్చిందట. బ్రేక్ తర్వాత వచ్చినా పేమెంట్ విషయంలో ఈ భామ ఎక్కడా తగ్గడం లేదన్న గుసగుస ఫిలింసర్కిల్స్ లో వినిపిస్తోంది. పారితోషికంలో రాజీ అన్నదే లేదని ముందే చెప్పేస్తోందట.