బిబి4 : అమ్మ రాజశేఖర్ వర్సెస్ సోహెల్.. అవినాష్ కు గాయం

0

బిగ్ బాస్ కిల్లర్ కాయన్స్ టాస్క్ నిన్నటి ఎపిసోడ్ లో కూడా కొనసాగింది. పై నుండి పడుతున్న కాయిన్స్ ను ఎవరు ఎక్కువగా కూడబెట్టుకుంటారు అనేది టాస్క్. ఈ టాస్క్ ఫిజిల్ అవ్వడం వల్ల గంగవ్వ సైడ్ కు ఉంది. నోయల్ కు కాలి గాయం కారణంగా ఆయన కూడా అగ్రసివ్ గా లేడు. లాస్య మరి కొందరు కూడా లైట్ గానే ఉన్నారు. ఈ గేమ్ లో అమ్మ రాజశేఖర్.. సోహెల్.. మెహబూబ్.. సుజాత.. అఖిల్.. హారికలు చాలా అగ్రెసివ్ గా పాల్గొన్నారు. వీరు ఒకరి కాయిన్స్ ను మరొకరు దొంగిలించడం లాక్కోవడం వంటివి చేశారు.

ముఖ్యంగా సోహెల్ మరియు మెహబూబ్ లు తెల్ల వార్లు కూడా నిద్ర పోకుండా ఎవరు నిద్ర పోతే వారి వద్దకు వెళ్లి కాయిన్స్ దొంగిలించేందుకు ప్రయత్నించారు. కాయిన్స్ దొంగిలించేందుకు తీవ్రంగా ప్రయత్నించిన వీరిద్దరు టాప్ లో నిలిచారు. అమ్మ రాజశేఖర్ ఈ టాస్క్ లో బాగానే కాయిన్స్ ను దక్కించుకున్నారు. కాని ఆయన పడుకున్న సమయంలో బెడ్ ను లేపి మరీ మొత్తం కాయిన్స్ ను తీసుకు వెళ్లారు. సోహెల్ కాయిన్స్ తీసుకు వెళ్లాడని తెలిసి అమ్మ రాజశేఖర్ చాలా కోపడ్డాడు. కష్టపడి దక్కించుకున్న కాయిన్స్ ను అలా దొంగతనం చేయడం ఏంట్రా అంటూ సోహెల్ ను ఉద్దేశించి అన్నాడు. మాస్టర్ నేను గేమ్ ఆడుతున్నాను అంటూ సోహెల్ అన్నాడు.

కిల్లర్ కాయిన్స్ టాస్క్ మొదటి లెవల్ పూర్తి అయ్యేప్పటికి మెహబూబ్ టాప్ లో ఉన్నాడు. ఆ తర్వాత స్థానంలో సోహెల్ నిలిచారు. వీరిద్దరే ఎక్కువ కాయిన్స్ కలిగి ఉంటారని అనుకున్నట్లుగానే వారే ఎక్కువగా కలిగి ఉన్నారు. అయితే ముఖ్యమైన స్విచ్ కాయిన్ మెహబూబ్ కు దొరికితే అది అక్కర్లేదేమో అని వదిలేశాడు. ఆ కాయిన్ ను సుజాతా దక్కించుకుంది. ఆ కాయిన్ వల్ల ప్రత్యేకమైన పవర్ వస్తుందని బిగ్ బాస్ ప్రకటించడంతో మెహబూబ్ వెర్రి మొహం వేశాడు. సుజాత ఆ కాయిన్ ను రాత్రి అంతా చాలా జాగ్రత్తగా దాచుకుంది.

ఇక గేమ్ రెండవ స్టేజ్ కు వెళ్లింది. సభ్యులు అంతా వెల్ ప్రో జాకెట్ లు వేసుకుని ఉంటారు. ఒక కిల్లర్ కాయిన్ ఉంటుంది. ఆ కాయిన్ ను వెల్ ప్రో జాకెట్ కు అంటించాల్సి ఉంటుంది. బజర్ మోగే సమయానికి ఎవరి జాకెట్ కు కాయిన్ అంటి ఉంటుందో వారి వద్ద ఉన్న కాయిన్స్ సగం అవుతాయి. వెల్ ప్రో జాకెట్ గేమ్ మద్యలో కూడా మరోసారి సోహెల్ మరియు అమ్మల మద్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. సోహెల్ ఆవేశంతో ఊగి పోయాడు. అదే సమయంలో అవినాష్ కాళికి దెబ్బ తగిలి కిందపడి పోయాడు. అతడిని మెడికల్ రూంకు తీసుకు వెళ్లారు.

ఆ సమయంలో మోనాల్ బాత్ రూంలోకి వెళ్లి కన్నీరు పెట్టుకుంది. ఆ సమయంలో ఆమె హిందీలో మాట్లాడుతూ ఉండగా ఆమెను తెలుగులో మాట్లాడాల్సిందిగా బిగ్ బాస్ ఆదేశించాడు. ఈ సమయంలో తనకు తెలుగులో మాట్లాడటం రాదు అంటూ ఆమె బాత్ రూం లోపలకు వెళ్లి కన్నీరు పెట్టుకుంది. ఆమెను కావాలని టార్గెట్ చేయడం వల్ల కన్నీరు పెట్టుకున్నట్లుగా అనిపించింది. అసలు విషయం ఏంటీ అనేది నేటి ఎపిసోడ్ లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.